బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీరాజ్ అవార్డు
గజ్వేల్ నియోజకవర్గం మండలంలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీ రాజ్ అవార్డు గ్రామ సర్పంచ్ పాశంబాపిరెడ్డి గ్రామపంచాయతీ సెక్యూరిటీ జయ రాములు కు ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అవార్డును అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బాపురెడ్డి మాట్లాడుతూ రావడం ఎంతో గర్వకారణమని గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ జాతీయస్థాయి దీన్ దయాల్ పంచాయతీ రాజ్ పురస్కార్ అవార్డులలో భాగంగా మండలంలో 16 గ్రామాలలో బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి రావడం గర్వించదగ్గ విషయం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధిలో భాగంగా పల్లె ప్రగతి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. ఆయన వెంట గ్రామ పంచాయతీ సెక్రెటరీ జయ రాములు తదితరులు పాల్గొన్నారు
