Breaking News

డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామికి ఘన సన్మానం

156 Views

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలో గల శ్రీ రాజరాజేశ్వర శివాలయంలో శ్రీ శుభ కృత నామ సంవత్సరం ఉగాది పండగ పర్వదిన సందర్భంగా బుధవారం ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పసువునూరి వీరేశం గుప్త, ఆలేరు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సముద్రాలకు కుమార్ గుప్తా, ఆలేరు పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు అయిత వెంకటేష్, ఆధ్వర్యంలో డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామికి శాలువా కప్పి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక జాతీయ అధ్యక్షులు, భక్తి అవార్డు గ్రహీత వంగపల్లి అంజయ్య స్వామికి ఇటీవల ఏషియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డ్ తమిళనాడులో ఆర్యవైశ్యుడికి రావడం గర్వించదగ్గ విషయంఅని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు చొల్లేటి ప్రకాష్, గందె అంజయ్య, భేలిదే వెంకటయ్య, భేలీదే వరప్రసాద్, గంప కృష్ణ, చోళ్ళేటి రాజేశ్వర్, పొద్దుటూరి కుమార్, మురారిశెట్టి అశోక్,తదితర ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *