
సిద్దిపేట జిల్లాలోని జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామపంచాయతీ “క్లీన్ అండ్ గ్రీన్” విభాగంలో నేషనల్ పంచాయతీ అవార్డులలో భాగంగా గత సంవత్సరం నవంబర్-2022 లో జరిగిన కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి కేంద్ర ప్రభుత్వ అసెస్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం ” దీన్ దయల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్”ఆరోగ్య పంచాయతీ, మహిళా స్నేహ పూర్వక బెస్ట్ పంచాయతీ అవార్డు చాట్లపల్లి గ్రామపంచాయతీ గెలుపొందింది. ఈ అవార్డ్స్ ప్రధానోత్సవములో భాగంగా ఎంపిపి బాలేశం గౌడ్, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపిడివో శ్రీనివాస్ వర్మ, గ్రామ సర్పంచ్ రాచర్ల నరేష్, ఎంపిటిసి కావ్య దర్గయ్య, కవిత శ్రీనివాస్ రెడ్డి, కో ఆప్షన్ సయ్యద్ ఇక్బాల్, పంచాయతి కార్యదర్శి సాయి బాబా, అంగన్వాడి ఉపాధ్యాయురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు




