ప్రాంతీయం

రాంసాగర్ పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించిన మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి

37 Views

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రామసాగర్‌లో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శైలజ, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, సర్పంచ్ నరేష్ గౌడ్, ఉపాధ్యాయులు శివకుమార్, శ్రీకాంత్ రెడ్డి, లావణ్య, రూమ్ టు రీడ్ కోఆర్డినేటర్ భవాని, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లైబ్రరీ యొక్క ఆవశ్యకత, దీని ద్వారా కలిగే ప్రయోజనాలు, పుస్తకాల వల్ల పిల్లలకు లభించే లాభాల గురించి వివరించారు. తల్లిదండ్రులు పిల్లల్లో పాఠనాసక్తిని పెంపొందించేందుకు ఇంట్లో ప్రోత్సహించాలని సూచించారు. పిల్లలు లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలి, చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలి, పుస్తకాలు బాగా చదవాలని దిశానిర్దేశం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *