ప్రాంతీయం

భక్తిరత్న పురస్కార గ్రహీతకు ఘన సన్మానం

90 Views

భక్తిరత్న పురస్కార గ్రహీతకు ఘన సన్మానం

రామకోటి రామరాజును సన్మానించిన ఆర్యవైశ్య భక్త బృందం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ జులై 11

సిద్దిపేట జిల్లా  జగదేవ్ పూర్ ఆర్యవైశ్య భక్త బృందం వారు గురువారం నాడు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు భక్తిరత్న జాతీయ పురస్కారం వచ్చిన శుభ సందర్బంగా ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఆర్యవైశ్య భక్త బృందం వారు మాట్లాడుతూ రామ నామమే ప్రాణమని నమ్మిన రామకోటి రామరాజు కృషి, పట్టుదల వల్ల మా గ్రామానికి మొదటిసారిగా భద్రాచల దేవస్థాన ముత్యాల తలంబ్రాలు రావడం జరిగిందన్నారు. అదేవిధంగా ఒడ్లు ఓలిచి గోటి తలంబ్రాలు భద్రాచల సీతారాముల కళ్యాణానికి పంపించే అదృష్టం కలగడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు. ఇలాంటి భక్తి మార్గాన్ని లక్షల మంది భక్తులకు చూపించడం రామకోటి రామరాజుకే దక్కిందన్నారు. గత 25సంవత్సరాలనుండి చేస్తున్న ఆధ్యాత్మిక సేవ అమోగమన్నారు. భక్తిరత్న జాతీయ పురస్కారం రావడం హర్షించదగ్గ విషయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో చిగుళ్లపల్లి వెంకటేశం, మడిపడిగే రామకృష్ణ, పెద్ది శంకర్, కొండల్, చంద్రశేఖర్, హరినాథ్, సత్యపాల్, వీరయ్య భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్