ప్రాంతీయం

“ఇట్లు” సినిమా ట్రీజర్ లాంచ్ చేసిన – మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

103 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుదవారం ఇట్లు సినిమా ట్రీజర్ లాంచ్ చేసిన గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇట్లు సినిమా గజ్వేల్ వాసి రోషిరెడ్డి మాటలు, పాటలు, దర్శకత్వం వహించి గజ్వేల్ ప్రాంతంలో నిర్మించిన చిత్రం ఈనెల 24న విడుదల కానున్న సందర్భంగా ఇట్లు సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం జరిగిందని సినిమా బాగుందని ఈ ప్రాంతంలో నిర్మించిన చిత్రం అందరూ చూసి ఇట్లు సినిమాను ఆదరించాలని కోరారు. ఇట్లు సినిమా దర్శకులు రోషిరెడ్డి మాట్లాడుతూ ఇట్లు సినిమా గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో గత మూడు సంవత్సరాలుగా నిర్మించి ఈ నెల 24న రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల అవుతుందని గజ్వేల్ తిరుమల టాకీస్ లో విడుదల కాబోతుంది అని ప్రతి ఒక్కరూ చూసి నచ్చితే నలుగురికి చెప్పాలని ఇట్లు సినిమాను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, సినీ హీరో అనిల్ ముగిలి, పద్మశాలి సంఘం అధ్యక్షులు దుర్గప్రసాద్, నాయకులు, పొద్దుటురి శ్రీనివాస్, ప్రసాద్, వెంకటేష్, ఇట్లు సినిమా సహ నిర్మాత డాక్టర్ లింగం, ఇట్లు సినిమా బృందం తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *