ప్రాంతీయం

ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత

51 Views

ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత

సురక్షితమైన ప్రయాణానికి నిబంధనలు చాలా ముఖ్యం

మద్యం సేవించి వాహనాలు నడపవద్దు

డ్రైవింగ్ లైసెన్ లేకుండా వాహనాలు నడపవద్దు

మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దు

సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్

సిద్దిపేట జిల్లా, జనవరి 

రోడ్డు సురక్ష అభియాన్ / రహదారి భద్రత అభియాన్ ప్రోగ్రాంలో భాగంగా సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐలు విజయభాస్కర్, ఉమేష్, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద సిద్ధిపేట ట్రాఫిక్ పిఎస్ సిబ్బంది వినూత్న రీతిలో ఆర్ కె – టెడ్డి ఈవెంట్స్ తో కలిసి హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకి సీట్ బెల్ట్ ధరించిన ఫోర్ వీలర్ వాహనదారులకి గులాబీ పువ్వు ను అందిస్తూ వారిని అభినందించడం జరిగింది . అలాగే వాహనదారులకు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ హెల్మెట్ ధరించవలెను సీట్ బెల్ట్ ధరించవలెను మద్యం తాగి వాహనాలు నడపడం చట్ట ప్రకారం నేరమని అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలో ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా వాహనాలు నడిపి గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు విజయ భాస్కర్, గోపాల్ రెడ్డి, ఉమేష్, మల్లేశం, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి మోహన్, కానిస్టేబుల్ శ్రీనివాస్ అఖిల్ ఆర్కే టెడ్డి ఈవెంట్స్ ఆర్గనైజర్ పరుశురాములు అతని సిబ్బంది పాల్గొనడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *