సీతక్క ఐదు రౌండ్ల ప్రచారం చేసినా 3,230 ఓట్ల మెజారిటీతో శ్రీలత సెన్సేషన్ గెలుపు; కేటీఆర్ సన్మానం
ములుగు జిల్లా,డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7
ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామ పంచాయతీలో హాట్‌టాపిక్‌గా మారిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితం నమోదుైంది. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న సీతక్క ఐదుసార్లు ప్రచారానికి వెళ్లి బలపరిచిన అభ్యర్థి ఉన్నప్పటికీ, ఓటర్లు తిరగబెట్టి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలతకు 3,230 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపు కట్టబెట్టారు.ములుగు జిల్లాలో అతిపెద్ద గ్రామంగా నిలిచిన ఏటూరు నాగారం ఈసారి రాజకీయంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. శాసనసభ్యులు, పెద్దల సందర్శనలు, ప్రచార యుద్ధం జరిగిన ఈ గ్రామంలో ప్రజాభిప్రాయం మాత్రం వేరే దారిలో నడిచింది.ఫలితాలు వెలువడిన తర్వాత బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్వయంగా శ్రీలతను సన్మానించి, అభినందించారు. స్థానిక అభివృద్ధి, గ్రామం అవసరాలు తీర్చడంపై ప్రజల నమ్మకమే ఈ భారీ మెజారిటీకి కారణమని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది.ఈ విపరీతమైన ఆధిక్యం, ప్రచార సమీకరణాలను చెదరగొట్టే ఓటర్ల తీర్పు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏటూరు నాగారం ప్రజలు “స్థానిక అభివృద్ధికి ఓటు” వేసారనే సందేశం స్పష్టమైంది.





