ప్రాంతీయం

28,29 తేదీలలో డిల్లీ లో జరిగే ధర్నా విజయవంతం చెయ్యాలి . — కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…

124 Views

ముస్తాబాద్ ప్రతినిధి మార్చి 21, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఢిల్లీలో జరిగే ధర్నానీ విజయవంతం చేయాల్నారు. బిసిల కులగణన చేస్తామని చెప్పి పార్లమెంట్ సమావేశంలో ఒక్కరోజు కూడా బిసి బిల్లు పైన కానీ బిసిల సమస్యల పైనగానీ బిసి కుల జనగణన గురించి గానీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. దానికి నిరసనగా ఈనెల 28,29 తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ అద్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో 28 రాష్టాల నుండి బిజెపి యేతర పార్టీలతో కలిసి వుంటుంది అని అన్నారు. బిసి విద్యార్థులు, మేదావులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్, నాయకులు, జయ్యరం నవీన్, కదిరే ప్రశాంత్, గొల్లపెల్లీ ముకేష్, చిట్టబోయిన రాకేష్, లింగంపెల్లి ఆశ్విత్,గుండు అభిరామ్, రాంపల్లి ప్రభాస్, నాయిని కార్తీక్, విజయ్,కార్తీక్, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *