ప్రాంతీయం

సమగ్ర భూ సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య

18 Views

సమగ్ర భూ సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి,జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య

మంచిర్యాల జిల్లా,ఫిబ్రవరి 19, 2026:
సమగ్ర భూ సర్వే పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య తెలిపారు. గురువారం జిల్లాలోని తాండూరు మండలం రాంపూర్ గ్రామ శివారులో కొనసాగుతున్న సమగ్ర భూ సర్వే ప్రక్రియను రెవెన్యూ, సర్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర భూ సర్వే వలన కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి సర్వే ప్రక్రియ పూర్తి స్థాయిలో చేపట్టేందుకు సహకరించాలని తెలిపారు. సర్వే పనులను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి, మండల తహసిల్దార్, గ్రామ సర్పంచ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *