భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణం కోసం గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనే అవకాశాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజానికి ఇచ్చారు. సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో వాడ వాడలా వేలాది మంది భక్తులు రామనామ స్మరణ చేస్తూ గోటితో వొడ్లను ఓలిచారు. 20కిలోల పైగా గోటి తలంబ్రాలను సోమవారం నాడు భద్రాచల దేవస్థాన ఏఈవో శ్రవణ్ కుమార్ కి దేవస్థానంలోనే తలంబ్రాలకు ప్రత్యేక పూజ జరిపి రామకోటి రామరాజు అందజేశారు.ఈ సందర్భంగా భద్రాచల దేవస్థాన ఏఈవో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల రామకోటి రామరాజు కృషి పట్టదల ఆమోగన్నాడు. వేలాది భక్తులచే రామనామం లిఖింప జేయడమే కాకుండా కోటి తలంబ్రాల దీక్షకు శ్రీకారం చుట్టి అద్భుతంగా నిర్వహించిన రామకోటి రామరాజుకు సీతారాముల పట్టువస్రాలను అందజేసి ఘనంగా సన్మానించి ఎన్నో కష్టాలను అనుభవిస్తున్న లెక్కచేయకుండా రాముని కోసమే తన జీవితాన్ని దారపోశాడని తాను కూడా చలించి తన వంతు ఆర్థిక సహకారం అందించాడు భద్రాచల ఏఈవో శ్రవణ్ కుమార్ గారు. ఈ భక్తుని కోసం భద్రాచల దేవస్థాన తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయన్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయం సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, గజ్వేల్ కు చెందిన అర్చకులు నక్క ప్రదీప్ శాస్త్రి పాల్గొన్నారు.




