గజ్వేల్ నియోజకవర్గం
సిద్దిపేట జిల్లా
బంగ్లా వేంకటాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ లోక కళ్యాణం కొరకు సీతారాములూరి కళ్యాణ మహోత్సవం గ్రామంలో జరగడం శుభపరిణామమని, అదే గ్రామంలో ఈ శ్రీరామనవమి రోజున అయోధ్య బాల రాముని నుదుటిపై సూర్యకిరణాలు పడటం దేశానికి సంతోషకరమన్నారు.
కళ్యాణ అనంతరం గ్రామంలోని కనుల విందుగా డీజే పాటలతో కోలాటాలతో చూపరులను కనువిందు చేసే విధంగా శోభయాత్ర కొనసాగించారు.
కళ్యాణ మహోత్సవానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి విజయవంతం చేసినందుకు వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు.