
జగదేవపూర్ మండలం రాంనగర్ గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పి గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ రోడ్డు కింద పడి సృహ తప్పి పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న తిగుల్ గ్రామ సర్పంచ్ భానుప్రకాష్ రావు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం తన కారులో గజ్వేల్ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.




