ప్రాంతీయం

ఆకస్మిక తనిఖీ చేసిన సీపీ

127 Views

రామగుండం పోలీస్ కమీషనరెట్

అంతర్గం, రామగుండం పోలీస్ స్టేషన్, ఆకస్మిక తనిఖీ చేసిన సిపి

అంతర్గం, రామగుండం పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను, సిసి కెమెరాల పనితీరు ను పోలీస్ కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పని తీరు పై, పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు.నేరాల నియంత్రణ కు తీసుకొంటున్న చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని బ్లూకోట్స్‌ టీమ్‌లు 24 గంటలపాటు పని చేస్తాయన్నారు. పెట్రోలింగ్‌ ముమ్మరం నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి రమేష్, సీఐ అజయ్ బాబు , ఎస్‌ఐ లు వెంకట్ , సతీష్ తోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్