ప్రాంతీయం

స్వేచ్ఛయుత ఎన్నికలు – ఎన్నికల్లో శాంతి భద్రత కోసమే ఫ్లాగ్ మార్చ్

38 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తాళ్ళగురిజాల పోలీసుల ఫ్లాగ్ మార్చ్.

స్వేచ్ఛయుత ఎన్నికలు – ఎన్నికల్లో శాంతి భద్రత కోసమే ఫ్లాగ్ మార్చ్ : బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్

కమీషనర్ అఫ్ పోలీస్, రామగుండము ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ సూచనల మేరకు రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు తాళ్ళగురిజాల పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రవెల్లి, చాకెపల్లి మరియు బుధకూర్డ్ గ్రామాలలో రవికుమార్, బెల్లంపల్లి ఏసీపీ  ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ ప్లాగ్ మార్చ్ లో అధికారులు, సిబ్బంది తో కలిసి ముఖ్యమైన రహదారులు, గ్రామాలలోని వాడ లలో పోలీసు బృందాలు నడుచుకుంటూ ప్రజలకు పోలీస్ లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారనే నమ్మకం, చట్టం, శాంతి భద్రతపై భరోసా కల్పించాయి.

ఈ సందర్బంగా ఏసీపీ  మాట్లాడుతూ ఎన్నికల లో ఎలాంటి అక్రమాలు, డబ్బు పంపిణీలు, బెదిరింపులు, ఓటర్లపై ఒత్తిడి వంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో శాంతి భద్రత కాపాడేందుకు ప్రత్యేకంగా ప్లాగ్ మార్చ్, పెట్రోలింగ్ చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఓటు విలువైనది. ప్రజలు స్వేచ్ఛగా వారి ఓటు వేయడానికి అన్ని రకాల పటిష్టమైన భద్రత పరమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, శాంతియుత వాతావరణం లో స్వేచ్ఛయుత ఎన్నికలు జరగాలని, ప్రతి ఒక్క ఓటరు ఎలాంటి ప్రలోబాలకి, బెదిరింపులకి లోను కాకుండా పోలింగ్ స్టేషన్ కి రావడమే పోలీసుల లక్ష్యం అని తెలిపారు.

ఈ కార్యక్రమం లో ఏ. రవికుమార్, ఏసీపీ బెల్లంపల్లి, సి హేచ్. హనోక్, సీఐ బెల్లంపల్లి రూరల్, శ్రీనివాస్ సీఐ బెల్లంపల్లి-I టౌన్, SI బెల్లంపల్లి-II టౌన్, ఎస్ ఐ నెన్నెల్, ఎస్ ఐ తాళ్ళగురిజాల మరియు 40 మంది సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *