నిరుద్యోగుల జీవితాలతో సర్కారు చెలగాటం
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతుందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మండల కేంద్రం రాయపోలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఐటి శాఖ మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రులు, ఉన్నతాధికారులు ధన దాహంతో లక్షల మంది నిరుద్యోగులపై నీళ్లు చల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల సహాయం లేకుండా సాధారణ వ్యక్తులు ఇంత దారుణానికి పాల్పడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజ్ పై సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి నిరుద్యోగులకు ఆర్థిక సహాయం పేపర్ లీకేజీ పై బాధ్యత వహిస్తూ ఐటి శాఖ మంత్రి కేటీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్ లు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తప్పేట సుధాకర్, కిష్టారెడ్డి, దుర్గా ప్రసాద్,కృష్ణ గౌడ్, అనిల్ గౌడ్, దయాకర్, భాస్కర్, అజిత్ గౌడ్, వెంకట్ రెడ్డి, కరుణాకర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.