*మంచిర్యాల కలెక్టరేట్ ముందు ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు *
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో విద్యా శాఖలో పనిచేస్తున్న ఎస్ ఎస్ ఏ (తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు)లను కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వారిని క్రమబద్ధీకరణ చేస్తానని ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం వారిని క్రమబద్ధీకరణ చేయాలని వారు డిమాండ్ చేశారు,ఒకనాడు ముఖ్యమంత్రి పి సి సి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు చాయి తాగే లోపు ఎస్ ఎస్ ఏ ఉద్యోగస్తులను క్రమబద్ధీకరించొచ్చని అన్నారు కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైన వారు చాయ్ తాగడం అవడం లేదంటూ హెద్దేవ చేశారు, వెంటనే ఎస్ ఎస్ ఏ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు.
