శనివారం రోజున ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దేవస్థాన అభివృద్ధి కొరకు ప్రతి సంవత్సరం 100 కోట్లు కేటాయిస్తానని చెప్పి మాట ఇచ్చి మోసం చేసినందుకు గత ఏడు సంవత్సరాల నుండి ఏడు వందల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వేములవాడ లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహా దీక్ష కలదు ఎల్లారెడ్డిపేట మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు వివిధ మోర్చా నాయకులు అధ్యక్షులు బూత్ కమిటీ అధ్యక్షులు అందరూ తప్పకుండా హాజరు కావాలని జిల్లా బిజెపి అధికార ప్రతినిధి బందారపు లక్ష్మా రెడ్డి పిలుపునిచ్చారు
ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు విజయశాంతి హాజరవుతున్నారని అన్నారు
