చొప్పదండి గడ్డ పై జెండా పాతిన మా బాల్య మిత్రుడు డాక్టర్ మేడిపల్లి సత్య. చొప్పదండి( ఎస్సీ)రిజర్వ్ డ్ స్థానం నుండి ఎల్లారెడ్డి పేట మండలము లోని కోరుట్ల పేట కు చెందిన డాక్టర్ మేడిపల్లి సత్యం చొప్పదండి గడ్డ పై హస్తం పార్టీ నుండి ఎం. ఎల్ . ఏ గా ఎన్నికయ్యారు.కోరుట్ల పేట కు చెందిన సత్యం మేడిపల్లి లక్ష్మి – భూ పాల్ దంపతులకు ఇద్దరు కుమారులు.మొదటి సంతానం సత్యం కాగ ,రెండవ సంతానం దేవా నందం దేవానందం ప్రస్తుతం కోరుట్ల పేట సర్పంచ్ గా పని చేస్తున్నారు. సత్యం రుపాదేవిని కులాంతర వివాహం చేసుకోగా ఆమె వికారాబాద్ జిల్లాలో హై స్కూల్ లో అద్యాపకురాలిగా పనిచేస్తోంది.యోజిత్,రిషిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.మొదటి తరగతి నుండి ఐదవ తరగతి వరకు కోరుట్ల పేట ప్రభుత్వ పాఠశాలలో,ఆరవ తరగతి నుండి పదవ తరగతి1996-97 వరకూ బోప్పపూర్ హై స్కూల్ లో 1997-99వరకు ఇంటర్ కామారెడ్డిలో గల ప్రభుత్వ కళాశాలలో,1999-2002వరకు సిద్దిపేట డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో 2004 వ విద్యాసంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్,2007 వ సంవత్సరంలో రాజ నీతి శాస్త్రం లో పి హెచ్ డి పట్టా పొందారు. 2014లో టిడిపి నుండి ఎం ఎల్ ఏ గా,2018 లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గాన్ని అంటుపెట్టుకుని ఉన్నారు.ప్రజల సాధక బాధకాలలో పాలు పంచుకుని 2023 లో చొప్పదండి ఎం.ఎల్ ఏ గా ఎన్నికయ్యారు.సత్యం మా బాల్య మిత్రునికి రాచర్ల బొప్పాపూర్ హై స్కూల్ 1996-97 బాల్యమిత్రులు లు శుభాకాంక్షలు తెలిపారు.
