రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని, దీనికి ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ అని బిజెపి బిసి సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు గర్నెపల్లి కృష్ణమూర్తి అన్నారు. శనివారం జగదేవపూర్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా అవినీతి ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలువడంతో రాష్ట్రంలో బిఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వాపోయారు. నిరుద్యోగుల పాలిట బిఆర్ఎస్ ప్రభుత్వం శాపంగా మారిందని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ లో బిఆర్ఎస్ కు సంబంధం ఉందని, ప్రశ్నించిన బిజెపి పై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దళితబంధు ఇస్తామని ఆశ చూపుతున్నారే తప్ప ఇవ్వడం లేదని అన్నారు. అలాగే త్వరలో డబుల్ ఇళ్లు ఇస్తామంటూ నెలలు గడుస్తున్న నేటికి ఇవ్వడం లేదన్నారు. అబద్దాలతో బిఆర్ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రానున్నది బిజెపి ప్రభుత్వమే అని ఆశాభావం వ్యక్తం చేశారు.
