ప్రాంతీయం

పాఠశాలల్లో  మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నుండి ఉపాధ్యాయులను మినహాయించాలి

72 Views

పాఠశాలల్లో  మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నుండి ఉపాధ్యాయులను మినహాయించాలి

_జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్

సిద్దిపేట జిల్లా, నవంబర్ 17

పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యత నుండి ఉపాధ్యాయులను మినహాయించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ములుగు మండల సభ్యత్వ సేకరణలో భాగంగా ములుగు, వంటిమామిడి, చిన్న తిమ్మాపూర్, ఆర్ అండ్ ఆర్ కాలనీ, తుంకి బొల్లారం,సింగన్న గూడ,బండ తిమ్మాపూర్, బండ మైలారం కొక్కొండ, కొత్తూరు తదితర పాఠశాలను సందర్శించి సమస్యలను సేకరించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిలర్లు యూసుఫ్ మరియు రాజులు తో  కలిసి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ చాలా ఇబ్బందులతో కూడుకున్నదని రెగ్యులర్ గా బిల్లులు రాక, వచ్చిన బిల్లులు మెనూ ప్రకారం వంట చేస్తే సరిపోక వంట మానేస్తామని మధ్యాహ్న భోజన కార్మికుల హెచ్చరికలు ఒకవైపు, ఎలాగైనా సరే మధ్యాహ్న భోజన పథకం నిర్వహించి తీరాల్సిందే అని అధికారుల ఒత్తిళ్ల మధ్య ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయుల పై చిన్నచిన్న కారణాలతో చర్యలు తీసుకోవడం జిల్లా ఉన్నతాధికారులకు తగదని సూచించారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రతి నెల మధ్యాహ్న భోజన వంట బిల్లులు మరియు మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇట్టి కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విద్యాధర్ రెడ్డి, రాజ నరసింహ, సీనియర్ నాయకులు నరసింహారావు, కటకం రాజయ్య శేషాచారి, తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *