మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో లెంకల బాలు మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సేవా రత్న అవార్డు గ్రహీత మ్యాకల కనకయ్య ముదిరాజ్ శనివారం నాడు మృతుడు లెంకల బాలు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి 5000/రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ యూత్ అధ్యక్షుడు మురళి, బిఆర్ఎస్ బిసి సెల్ ఉప అధ్యక్షుడు అజయ్, నర్సింలు, కొట్టాల మహేష్ తదితరులు పాల్గొన్నారు