ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 17, గంభీరావుపేట మండల కేంద్రంలో తెలంగాణ మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిబి సిఐడితో విచారణ జరిపించాలని పేపర్ లీకేజీ చైర్మన్ కమిషన్ కార్యదర్శి సభ్యుల బాధ్యతరాహిత్యాన్ని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాన్ఫిడెన్షియల్ విభాగంలోకి ఇతర సెక్షన్లలో డ్యూటీ చేసే వ్యక్తులు ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎలా ప్రవేశించారో యూజర్ ఐడి పాస్వర్డ్లు వారి చేతికి ఎలా వచ్చాయో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పులి దిండి ప్రవీణ్ కుమార్ మరియు నెట్వర్కు మేనేజర్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిలా పాత్ర పై గుర్తిస్తాయి విచారణ జరపాలని మాల మహానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దోసల చంద్రం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దోసల ప్రేమ్ కుమార్ జిల్లా నాయకులు మాల మహానాడు మండల అధ్యక్షులు లక్కం బాబు, పిట్ల రఘు, పెండల నర్సింలు, తలారి దేవరాజ్, దోసల శ్రీకాంత్, దయాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
