మంచిర్యాల జిల్లా.
విద్యార్థులకు మంచి విద్య అందించాలి: కలెక్టర్ కుమార్ దీపక్.
ఆర్కేపల్లి ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విద్యార్థులతో కాసేపు కాలక్షేపం చేసి తరువాత కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మంచి వసతులతో కూడిన భోజనం మరియు విద్యను అందించాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని మరియు నాణ్యమైన విద్యను బోధించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ కిషన్ ఎంపీడీవో మధుసూదన్ మరియు ఎంఈఓ గోపాల్ రావు పాల్గొన్నారు.
