ప్రాంతీయం

మంచిర్యాలలో ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవం

42 Views

మంచిర్యాలలో ప్రభుత్వ ఆసుపత్రి యందు ప్రపంచ హెచ్ఐవి ఎయిడ్స్ దినోత్సవం.

మంచిర్యాల జిల్లా.

ప్రపంచ ఎయిడ్స్ దినం పురస్కరించుకొని జిల్లా హెచ్ ఐ వి ఎయిడ్స్ సమీకృత వ్యూహ సంస్థ ఆద్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నందు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  సంబంధిత సిబ్బంది  మరియు వైద్య విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమాన్ని ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు  నిర్వహించిన వ్యాస రచన పోటీలోని విజేతలకు బహుమతులు  మరియు సంబంధిత ఆరోగ్య సిబ్బందికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత, ప్రోగ్రాం ఆఫీసర్ (ఎయిడ్స్ & లెప్రసి ) డాక్టర్ సుధాకర్ నాయక్ , ప్రోగ్రాం ఆఫీసర్ (ఎం హెచ్ ఎన్ ) డాక్టర్ అరుణశ్రీ ,  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ చే   ఉత్తమ పురస్కారాలు మరియు ప్రశంస పత్రాలు   అందించటం జరిగింది.

ఈ కార్యక్రమం లో నర్సింగ్ సూపరింటెండెంట్ అరుణ, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, కాసిపేట పి హెచ్ సి  వైద్య అధికారి శ్రీ దివ్య, తాళ్లపేట పి హెచ్ సి  అల్లాడి శ్రీనివాస్ హెల్త్ ఎడ్యుకేటర్,  దిశా క్లస్టర్ ప్రోగ్రాం మేనేజర్ రమేష్ , డేటా మేనేజర్ సంతోష్ , ఐ సి టి సి మరియు డి ఎస్ ఆర్ సి సిబ్బంది శ్రీనివాస్, రాజేందర్, నరేందర్ , నర్మద , జగన్, ఆంజనేయులు, ఎల్ ఏ సి ప్లస్ స్టాఫ్ నర్స్ లక్ష్మి, ఎస్ ఎస్ కే సిబ్బంది సతీష్ , కిషన్, నర్సింగ్ సిబ్బంది, స్వచ్చంద సంస్థ మరియు లింకేవర్కర్ స్కీమ్ , సిబ్బంది పాల్గొనటం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *