Breaking News నేరాలు

రష్యా ఉక్రెయిన్ రెండో రోజు భీకర యుద్ధం

309 Views

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రెండోరోజు భీకరంగా సాగుతోంది

రాజధాని కీవ్ ను మరికొద్ది గంటల్లోనే రష్యా స్వాధీనం చేసుకోబోతోందని తెలుస్తోంది.

అమెరికా, నాటో రష్యాకు భయపడ్డాయని.. తమను ఒంటరి చేశాయని ఆవేదనగా చెప్పారు యుక్రెయిన్ అధ్యక్షుడు వొదొలిమిర్ జెలెన్ స్కీ.

మరోవైపు.. స్వచ్చందంగా.. జనం ఆయుధాలు పట్టి రణరంగంలోకి దిగుతున్న పరిస్థితి నెలకొంది.

ఉక్రెయిన్ లోని కీలక న్యూక్లియర్ ప్లాంట్ చెర్నోబిల్ ను రష్యా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది.

తొలిరోజు రష్యా 203 బాంబు దాడులు చేసినట్టు ఉక్రెయిన్ తెలిపింది. రేడియో ధార్మిక వ్యర్థాల నిల్వలపై రష్యా బాంబులు వేసిందని.. దీంతో రేడియో ధార్మికత స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయిందని తెలిపింది.

గతంలో జరిగిన అణు దుర్ఘటన కారణంగా.. ఇప్పటికే చెర్నోబిల్ న్యూక్లియర్ స్థావరాన్ని మూసివేసింది ఉక్రెయిన్.

No Slide Found In Slider.

Poll not found