కండువాలు కప్పి పార్టిలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే
రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ సమక్షంలో మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఇల్లంతకుంట మండలంలోని తాళ్లపల్లి, పత్తికుంటపల్లి శంకరపట్నం మండలం ఆముదాలపల్లి, కరీంపేట గ్రామాల్లోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యంలో బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో పాటు మానకొండూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే
డా.రసమయి బాలకిషన్ చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షతులమై గులాబీ గూటికి చేరుతున్నట్లు తెలిపారు.
కొందరు స్వార్థ పరులు పదేళ్ల పాటు ఎన్నో పదవులు అనుభవించి, మంగళవారం వెన్నుపోటు పొడిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గు చేటన్నారు.
ఒక్కలిద్దరు పార్టీ నుండి వెళ్లినంత మాత్రాన ఒరిగేదేమి లేదని, వందలాది మంది రసమయకి అండగా ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో పత్తికుంటపల్లి మరియు తాళ్లపల్లి ప్రజలమంతా రసమయన్న వెంటే నిలిచి ముచ్చటగా మూడవ సారి హాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు..
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జెడ్పి వైస్ చైర్ పర్సన్ సిద్ధం వేణు, శ్రీనివాస్ రెడ్డి, శంకరపట్నం బీఆర్ఎస్ పార్టి మండల అధ్యక్షుడు గంట మహిపాల్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.