కంటి వెలుగు నిరుపేదలకు ఎంతో వరం లాంటిది
– కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన
– జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి
– గ్రామ సర్పంచ్ వెంకట్రాంరెడ్డి
– మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ పర్వేజ్
అంధత్వ నియంత్రణకు కంటి వెలుగు కార్యక్రమం గ్రామ ప్రజలకు ఎంతో సహకరిస్తుందని జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి, సర్పంచ్ వెంకట్రాంరెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్ అహ్మద్ అన్నారు. గురువారం రాయపోల్ మండలంలోని మంతూర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాని జెడ్పిటిసి లింగాయపల్లి యాదగిరి సర్పంచ్ వెంకట్రామిరెడ్డి మండల కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్ అహ్మద్ ప్రారంభించారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ కంటి వెలుగు కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళ అద్దాలను అందజేస్తున్నట్లు స్వామి అన్నారు .గ్రామ ప్రజలు కంటి వెలుగు కార్యక్రమాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మునయ్య కంటి వైద్య అధికారి డాక్టర్ శ్రీనివాస్ ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు