ప్రాంతీయం

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి జైలు శిక్ష…

87 Views

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి జైలు శిక్ష…

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 6, తెలుగు న్యూస్ 24/7

సిద్ధిపేట జిల్లా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఒక వ్యక్తి పట్టుబడ్డాడు. రూరల్ ఎస్సై రాజేష్ సమక్షంలో ప్రత్యేకంగా చేపట్టిన తనిఖీలలో బాసంపల్లి నరేష్ (35), తండ్రి బ్రహ్మయ్య, మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీసులు పట్టుకున్నారు.పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, నిందితుడికి ఐదు రోజుల కస్టడీ జైలు శిక్ష విధించినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్సై రాజేష్ మాట్లాడుతూ, ప్రజలు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ప్రాణనష్టం నివారించలేని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *