ప్రాంతీయం

చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ

59 Views

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి.

చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ.

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పట్టణ మండల డీజే ఎఫ్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు డెమొక్రటిక్ జర్నలిస్టు ఫెడరేషన్ చలో కరీంనగర్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు మోకనపల్లి బద్రి పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో విలేకరులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. అదేవిధంగా జర్నలిస్టులకు ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు 1. జర్నలిస్టుల ఇంటి నిర్మాణం కొరకు 200 గజాల ప్రభుత్వ స్థలము,2. జర్నలిస్టుల పిల్లలకు కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థలలో ఉచిత విద్య ,3.సమాజ శ్రేయస్సు కొరకు అహర్నిశలు కృషి చేస్తు.. ఎలాంటి జీతభత్యాలు లేకుండా నిస్వార్ధంగా పనిచేస్తున్న క్రమంలో ఆరోగ్యం క్షీణిస్తుంది కాబట్టి, ఉచిత వైద్యం అందాలనే నినాదంతో… ప్రస్తుత అధికార పార్టీకి తెలియజేయడం కొరకు ,ఉద్యమాల పోరుగడ్డ, డీజేఎఫ్ పురిటిగడ్డ కరీంనగర్ జిల్లాలో నిర్వహించుకునే, ఈ బ్రహ్మాండమైన కార్యక్రమానికి ,ప్రజా సమస్యలపైనే కాదు ,మా విలేకరుల సమస్యలు కూడా ముఖ్యమేనని, మనకోసం పోరాడే ఉద్యమమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంచిర్యాల జిల్లా డి జె ఎఫ్ జనరల్ సెక్రటరీ బర్ల తిరుపతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అనపర్తి కుమారస్వామి, జిల్లా ట్రెజరీ చొప్పదండి జనార్ధన్ అదేవిధంగా బెల్లంపల్లి జర్నలిస్టు మిత్రుడు అధిక మొత్తంలో పాల్గొని విజయవంతం చేశారు.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్