జగదేవపూర్ మండలంలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన నర్సోళ్ల రాములు భార్య మంజుల దంపతుల కూతురు అనూష వివాహానికి స్థానిక సర్పంచ్ రవికంటి చంద్రశేఖర్ పుస్తెమట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగే ప్రతి వివాహానికి పుస్తె మట్టెలు అందజేస్తు గ్రామ ప్రజల కష్ట సుఖాలను పంచుకొంటూ ప్రజల కోసం నిత్యం నిరంతరంగా కృషి చేస్తున్న ఏకైక నాయకులు మా గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా అని గ్రామ ప్రజలు కొనియాడారు.అనంతరం రావికంటి చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ మనం సంపాదించిన దాంట్లో లేని తృప్తి ఇలాంటి సేవ చేయడంలోనే సంతృప్తి ఆనందం కలుగుతుందని అన్నారు.గ్రామంలో ఇప్పటి వరకు దాదాపు 80 మంది పెళ్లిళ్లకు పైగా పుస్తె మట్టెలు అందజేయడం జరిగిందన్నారు.గ్రామ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు.
గ్రామ అభివృద్ధితో పాటు సామాజిక కార్యక్రమాలు చేయడం కర్తవ్యమన్నారు.
ఆడ బిడ్డలు పెళ్లి చేసుకుంటే మన సీఎం కేసీఆర్ ఆడపిల్లల కోసం లక్ష నూట పదహార్లు కళ్యాణ లక్ష్మి. షాధిముబారక్ ద్వారా అందజేస్తున్నారని దాంట్లో భాగంగానే నా వంతు ఈ సహాయంగా చేస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య,భిక్షపతి,స్వామి,మల్లేశం,మల్లయ్య,రాములు,కనకయ్య, బాలమణి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.