ప్రాంతీయం

అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం గజ్వెల్ బిజెపి, బీజేవైఎం నాయకులు

99 Views

అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం గజ్వెల్ బిజెపి, బీజేవైఎం నాయకులు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం TSPSC పేపర్ లీకేజ్ కి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, లీకేజీ పై సీబీఐ విచారణ జరిపించాలి :- బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్ యాదవ్లి కేజీ పై TSPSC ఎదుట ఆందోళన చేసిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ పై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు గజ్వేల్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన గజ్వెల్ బిజెపి, బీజేవైఎం నాయకులు ఈ సందర్భంగా బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్లను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేయడమేంటి అరెస్టులు, జైళ్లు బీజేపీ కార్యకర్తలకు కొత్తకాదు. నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల పక్షాన ఎంతకైనా పోరాడతాం. ప్రశ్నాపత్రాల లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి, అందుకు కారకులైన వారిని వదిలేసి పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడం సిగ్గు చేటు అన్నారు తక్షణమే అరెస్ట్ చేసిన బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ కార్యకర్తలందరినీ బేషరతుగా విడుదల చేయాలన్నారు లేనిపక్షంలో ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నారు ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై రాష్ర ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేయడం తప్పుడు చర్య. నయీం కేసు, డ్రగ్స్ కేసు, డేటా చోరీ సహా సిట్ కు అప్పగించిన కేసులన్నీ నీరుగారిపోయాయి. ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్పష్టం చేస్తున్నాం అన్నారు సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ అసెంబ్లీ కో కన్వీనర్లు ఎల్కంటి సురేష్, బండారు మహేష్, బిజెపి గజ్వెల్ మండల అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నత్తి శివకుమార్, బిజెపి మర్కుక్ మండల అధ్యక్షుడు రమేష్ గుప్తా, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు మహిపాల్ యాదవ్, బీజేవైఎం గజ్వేల్ పట్టణ అధ్యక్షులు ఆర్కే యాదవ్, బీజేవైఎం వర్గల్ మండల రవీందర్ గౌడ్, గజ్వేల్ మండల, వర్గల్ మండల ప్రధాన కార్యదర్శిలు అనిల్, పాండు, వర్గల్ మండల సోషల్ మీడియా కన్వీనర్ మధు గౌడ్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *