ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు సిద్ధం చేయాలి..
జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్..
సిద్దిపేట, మార్చి 28, తెలుగు న్యూస్ 24/7
ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లా వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణకు సిద్ధం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు.జిల్లా అదనపు కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభివృద్ధి మరియు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను వివరించడం, ఆయా పథకాల ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులతో మాట్లాడించడం మరియు ప్రజల నుండి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించడం తదితర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల వారీగా జిల్లా, డివిజన్, మండల మరియు గ్రామ పంచాయతీ స్థాయి వరకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించాలని అదేవిధంగా ఆయా గ్రామాల్లో చేపట్టిన పనుల వివరాలు, లబ్ధిదారుల వివరాలను అన్ని స్థాయిల అధికారులు పూర్తిగా తెలుసుకొని ప్రజలకు వివరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగరాజమ్మ, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, జడ్పీ సీఈఓ రమేష్, డిపిఓ రవీందర్, ఆర్టీవో లక్ష్మణ్, డీఈఓ శ్రీనివాసరెడ్డి, డిడబ్ల్యూఓ శారద, హౌసింగ్ పీడీ, విద్యుత్తు, ప్రణాళిక, వ్యవసాయ, క్రీడల అభివృద్ధి, ఉద్యానవన తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.





