ప్రాంతీయం

కోటి తలంబ్రాల దీక్షలో 100 మందికి పైగా భక్తులు పాల్గొని ఓడ్లను ఓలిచి భక్తిని చాటుకున్నారు.

140 Views

భద్రాచల దేవస్థాన పిలుపు మేరకు గజ్వేల్ పట్టణంలో శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం బుధవారం కిరాణ వర్తక సంఘం వారి నిర్వహలో 100 మందికి పైగా మహిళా భక్తులు పాల్గొని రామనామాన్ని స్మరిస్తూ భక్త శ్రద్ధలతో ఒడ్లను ఓలిచి వాటిని తలంబ్రాలుగా తయారుచేసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు మాట్లాడుతూ గత 25 సంవత్సరం నుండి మనము చేస్తున్న సేవను గుర్తించి మనకు భద్రాచల దేవస్థానం వారు మాకు ఈ అవకాశం ఇవ్వడం వల్ల అందరిని తలంబ్రాల దీక్షలో పాల్గొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. మహిళా భక్తుల తలంబ్రాలను ఓలిచి మాట్లాడుతూ ఇలాంటి అద్భుతమైన అవకాశం రామకోటి రామరాజు కల్పించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం ఇలాంటి అవకాశం ఇవ్వాలని భక్తులు కోరారు. రామకోటి రామరాజు దంపతులు చేస్తున్న ఆధ్యాత్మిక సేవను గుర్చించి భక్తులందరూ వారికి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కిరాణం సంఘం అధ్యక్షులు సిద్ధి భిక్షపతి, సెకెటరీ మెట్రాములు, కాపర్తి వైకుంఠం, మర్యాల శ్రీనివాస్, యాదగిరి, నంగునూరి సత్యనారాయణ, వంగపల్లి అంజయ్య స్వామి, తోట భిక్షపతి, కౌన్సిలర్లు మెట్టయ్య, రజిత సంఘం సభ్యులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *