ప్రాంతీయం

విద్యుత్ శాఖ ప్రజా భాట తో తీరుతున్న సమస్యలు

40 Views

విద్యుత్ సమస్యలు తీర్చడమే మా కర్తవ్యం సెస్ ఎఈ.పృథ్వీధర్ గౌడ్.

  1. తెలుగు న్యూస్ 24×7 సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో మంగళవారం ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని సమస్యలను సెస్ ఎఈ బుర్ర పృథ్వీధర్ గౌడ్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ పి డి సి ఎల్, ఎస్ సీ ఈ. బిక్షపతి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో సమస్యల పట్ల అవగాహన కల్పించి పరిష్కరించడం జరుగుతుందన్నారు.క్షేత్రస్థాయిలో విద్యుత్ స్తంభాలు లేనియెడల ఆ ప్రాంతంలోని వారు ఒక విద్యుత్ మీటర్ కు డబ్బులు కడితే అక్కడి వరకు విద్యుత్తు లైన్ ను సమకూరుస్తామన్నారు.ఈ డబ్బులు కట్టడం మీ సేవలో కట్టాలని అంతా ఆన్లైన్ విధానంలో ఉంటుందని అన్నారు.గ్రామంలో లో వోల్టేజి సమస్య తీర్చడానికి ఒక ట్రాన్స్ఫార్మర్ అవసరమని కొన్ని వార్డుల్లో విద్యుత్ స్తంభాలు అవసరమని నారాయణపూర్ సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ శాఖ ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా.ఎస్ ఎస్ 15 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ఆధునికరించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి,లైన్ ఇన్స్పెక్టర్ రమేష్.లైన్ మెన్ ప్రవీణ్ విద్యుత్ సిబ్బంది. నాయకులు గోగురి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *