ముస్తాబాద్ ప్రతిదీ కస్తూరి వెంకటరెడ్డి మార్చి15, జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖిమ్యనాయక్.
ఎల్లారెడ్డిపేట మండలంలోని హరిదాసు నగర్, పధిర గ్రామాలలో డబుల్ బెడ్రూం ఇల్ల నిర్మాణాలు చెప్పట్ట నున్న స్థలాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ ఖీమ్యా నాయక్ పరిశీలించారు. డబుల్ బెడ్ రూం ఇల్ల నిర్మాణాలను త్వరలో ప్రారంభించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ లను ఆదేశించారు. ఇల్ల నిర్మాణాలకు అవసరమయిన మెటీరియల్ సరఫరా పూర్తి స్థాయిలో జరిగేలా చూడాలని తహశీల్దార్ ను, స్థానిక ప్రజా ప్రతినిధులను ఆదేశించారు.డబుల్ బెడ్ రూం లబ్ధిదారుల ఎంపికపై గ్రామ సభలు నిర్వహించాలని ,గ్రామ సభలో ఇల్లు లేని నిరు పేదలకు ఇల్లుమంజూరు చేసే ప్రక్రియలో గ్రామస్థులతో లబ్ధిదారులకు సమావేశం ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జెడ్పీ టి సీ చీటీ లక్ష్మణ్ రావు, మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి, తహశీల్దార్ జయంత్ కుమార్, పిఅర్ డిఈ ఏఈలు పాల్గొన్నారు.
