ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి15, బీఎస్పీ వ్యవస్థాపకుడు దివంగత కాన్షీరాం 89.వ జయంతి సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం అక్కడే కేక్ కట్ చేసి కాన్సిరాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ మండల అధ్యక్షుడు సూడిది నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్పీ, దళిత ప్రజా సంఘాల నాయకులు అధికసంఖ్యలో పాల్గొని కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో బీఎస్పీ ఉపాధ్యక్షుడు జోగేల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొమ్మాట వెంకటేష్, కార్యదర్శి జంగంపల్లి భూదయ్య, కోశాధికారి మారిగాని హరిబాబు, కమిటీ సభ్యులు ఎలరవి, సంతోష్, ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు చుంచు అరుణ్, మచ్చ సంతోష్, గుండ్రావు, పలు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.




