ప్రాంతీయం

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు హాస్పిటల్ ముందు నిరసన

15 Views

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు హాస్పిటల్ ముందు నిరసన

*-మధ్యాహ్నం భోజన విరామం సమయంలో నిరసన – పెండింగ్ 6 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసిన ఉద్యోగులు*

మంచిర్యాల జిల్లా 20 మార్చి 2026.

మందమర్రి దీపక్ నగర్ లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు లంచ్ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి వేతనాలు ప్రభుత్వం తక్షణమే వేతనాలు విడుదల చేయాలని ఉద్యోగులు నల్ల రిబ్బన్లు తో హాస్పిటల్ ముందు నిరసన దిగిన ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎమ్) కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగులుకు తమకు రావలసిన 6 నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగులు నెలల తరబడి జీతాలు అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వనీ డిమాండ్ చేశారు. దీపక్ నగర పట్టణ పాథమిక ఆరోగ్య కేంద్రం ఉద్యోగుల జీవన సంక్షోభం వేతనాల అలస్యంతో ఉద్యోగులు ఇంటి అద్దెలు, విద్యుత్ బిల్లు, పిల్లల విద్యా ఫీజులు, ఈ.ఎం.ఐ.లు నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురుకుంటున్నారని అన్నారు (గత సంవత్సరం 2025 సెప్టెంబర్ నుండి ప్రస్తుతం ఫిబ్రవరి 2026 వరకు) మొత్తం 6 నెలల వేతనాలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, తక్షణమే చెల్లించాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వాన్ని చెల్లించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మందమర్రి దీపక్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పబ్లిక్ హెల్త్ మేనేజర్ సురేఖ, ఏ.ఎన్.ఎం.లు భారతి, రాజేశ్వరి ,పుష్ప , పద్మ సపోర్టింగ్ స్టాఫ్ సమ్మయ్య మరియు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *