ప్రాంతీయం

ప్రజా దివాస్ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటాం

172 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం 11 గంటల నుండి 02 గంటల వరకు జరిగిన ప్రజాదివాస్ లో ఎస్పీ రాహుల్ హెగ్డే  ప్రజల నుండి 10 ఫిర్యాదులు తీసుకున్నారు.
బాధితులకు న్యాయం చేయడానికి ప్రజదివాస్ కార్యక్రమాన్ని నిర్వహించామని ఎస్పీ  రాహుల్ హెగ్డే అన్నారు.మంగళవారం నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివస్ లో 10 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఫిర్యాదులు పెన్డ్డింగ్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఎస్ హెచ్ ఓ లను ఆదేశించినట్లు చెప్పారు. సివిల్ సమస్యలను కోర్టులో పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు.భూమిని నమోదు చేయమని లేదా పౌర వివాదాలకు పాల్పడాలని పరిష్కారాలు చేయమని పౌరులను ఎవరైనా బెదిరిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటాము ఇలాంటి సంఘటనలకు సంబంధించి ప్రజలు మా కార్యాలయానికి వచ్చి పిర్యాదు చేయవచ్చు..
సివిల్ తగాధల్లో ఏ అధికారి కూడా తలదూర్చకిడదని ఏ అధికారి ఐన సివిల్ తగాధల్లో ఇబ్బందికి గురిచేస్తే నేరు గా జిల్లా పోలీస్ కార్యాలయంలో పిర్యాదు చేయవచ్చు అని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే చెప్పారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7