త్వరలో జరగబోయే యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు జోక్యం చేసుకోకూడదని గజ్వేల్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ మన్నె కృపానందం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గ్రామస్థాయి నుంచి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి కుల, మత భేదాలు తేడా లేకుండా యువకులందరూ నాయకులుగా ఎదగడానికి ప్రజాస్వామ్య పద్ధతిలో యూత్ కాంగ్రెస్ ఎన్నికల నిర్వహించాలని ఆదేశించడం కానీ సిద్దిపేట జిల్లాలో మాత్రం పార్టీ పెద్దలు, సీనియర్ నాయకులు వారి వారి సంబంధించిన అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపి వారికే మద్దతు తెలిపే విధంగా సమావేశాలు నిర్వహిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు. దీని వల్ల పార్టీ కోసం క్రమశిక్షణగా, స్వచ్ఛందంగా పనిచేయాలనుకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందన్నారు. కాబట్టి జిల్లాలో సీనియర్ నాయకులు ఎవరు కూడా యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో జోక్యం చేసుకోకుండా రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడానికి సహకరించాలని ఆయన పేర్కొన్నారు.




