ఎల్లారెడ్డిపెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పల్స్ పోలియో పై అవగాహన కార్యక్రమం నిర్వహింన్చినట్లు ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మ నాయక్ తెలిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 27, 28 ఫిబ్రవరి మరియు మార్చి 2022 న నిర్వహించే పల్స్ పొలియో కార్యక్రమము విజయవంతం చేయాలని కోరారు. ఎల్లారెడ్డి పెట్ మండలం లో మొత్తం 29 పోలియో బూతులు,వీర్ణపల్లి మండలం లో 12 బూతులు ఉన్నాయని అన్నారు. 27.02.2022 నాడు పోలియో బుతులలో పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, 28 మరియు 1 న ఇంటి ఇంటికి వచ్చి పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది అని తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది తెలిపారు. ఎల్లారెడ్డి పెట్ మండలంలో 3869 ల మరియు వీర్ణపల్లి మండలం లో 1155 కి జరుగుతుందని తెలిపారు. ఇందులో 168 మంది సిబ్బంది మరియు ఒక మొబైల్ టీమ్ పాల్గొంటుంది అని వైద్యాధికారి దర్మనాయక్ తెలిపారు




