Breaking News కథనాలు ప్రాంతీయం

పంచాయతీ కార్మికుడి పాడే మోసిన ఎల్లారెడ్డిపేట సర్పంచ్….. మానవత్వం చాటుకున్న ప్రథమ పౌరుడు

309 Views

పాడే మోసిన సర్పంచ్ వెంకట్ రెడ్డి..
– జి పి ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిగా దహన సంస్కరణలో పాల్గొన్న సర్పంచ్
ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్/ఎల్లారెడ్డిపేట

ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ డ్రైవర్ రేసు బాబు మృతి చెందగా ఆయన పాడెను సర్పంచ్ వెంకట్ రెడ్డి పాడే మోసి దహన సంస్కరణలో పాల్గొన్నాడు. ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ విధులు నిర్వహిస్తున్న రేసు బాబు 33 శుక్రవారం అర్ధరాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శనివారం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య తో పాటు వివిధ నాయకులు బాబు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖ సముద్రంలో మునిగి పోయారు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుల సంఘం సభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. యువకుని మృతదేహాన్ని చూడటానికి గ్రామస్తులువెళ్లి కన్నీటి పర్యంతమయ్యారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *