ప్రాంతీయం

*వ్యవసాయ అనుబంధ రంగానికి పెద్ద పీట*

107 Views

సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
రాజన్న సిరిసిల్ల :జ్యోతి న్యూస్/
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో దీర్గకాళిక రుణాలకు సంబందించిన 5మంది రైతులకు గాను 25,00,000 లక్షల రూపాయల రుణాన్నిలబ్దిదారుల కు అందజేసారు.వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడం కొరకు మంత్రి కేటీఆర్ సూచన మేరకు, టేస్కబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు సహకారంతో దీర్గకాళిక రుణాలు పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా పంపిణి చేయటం జరుగుతుంది అని ఈ సందర్భంగా అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి తెలియజేసారు. రైతులు ఆర్ధిక స్వావలంబన సాదించాలంటే వ్యవసాయం తో పాటు దాని అనుబంద రుణాలు అయిన డైరీ,గొర్రెలు ,పట్టు పురుగులు,కోళ్ళపెంపకం,బోరు మోటార్ పైప్ లైన్, ట్రాక్టర్,హీర్వేస్టర్ లకు సహకార సంఘాలకు ఇచ్చే ధీర్గకాలిక రుణాలు వాడుకొని ముందుకు సాగాలని వారు కోరారు.లబ్దిదారులు సాన రాజు ఎల్లారెడ్డి పేట 4,50,000/పుటకుల్ల అంజయ్య సింగారం5,00,000/పయ్యావుల అన్నపూర్ణ ఎల్లారెడ్డి పేట 5,50,000/ఇప్పపూల రాజేందర్ నారాయణ పూర్
6,00,000/ఆదరవేణి మల్లవ్వ హరి దాస్ నగర్ 4,00,000 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమములో సంఘ ఉపాధ్యక్షులు జంగిటి సత్తయ్య మరియు డైరక్టర్లు , నేవూరి వెంకట నరసింహారెడ్డి, టీ ఆర్ ఎస్, పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తడుకల దేవరాజు, తెరాస నాయకులు హసన్, ఎల్లారెడ్డి, ఆనందం,తిరుపతి రెడ్డి, కిష్టారెడ్డి, దామోదర్, సంఘ సిఈవో కిషోర్ కుమార్, సంఘ సిబ్బంది, రైతులు తది తరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7