ప్రాంతీయం

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితపట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం… చేసింది ఎవరంటే…

286 Views

ముస్తాబాద్ మార్చి 11, (ప్రభన్యూస్) ఎంఎల్ సి బిఆర్ ఎస్ పార్టీ నేత కవిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కరీంనగర్ ఎంపి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అవివేకి మూర్ఖుడు అని ముస్తాబాద్ మండల అధ్యక్షుడు తీవ్రంగా విమర్శించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులతో కలిసి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను శనివారం మధ్యాహ్నం దగ్దంచేశారు,
అనంతరం ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవిత పట్ల అనుచితంగా మాట్లాడాడిన ఆయనకు మతి భ్రమించి మాట్లాడుతున్నాడని దుయ్యబడ్డారు, ఆయన వెంటనే కవితకు తెలంగాణ మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూలకు తిరగబోనివ్వమని హెచ్చరించారు ,
బండి సంజయ్ కి మహిళల పట్ల గౌరవం లేదని అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడని ఇప్పటికైనా తన ప్రవర్తనను మార్చుకోవాలన్నారు
ఆయనపై బీజేపీ పార్టీ చర్యలు తీసుకోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు ,
కవితకు ఒకవేళ తప్పు చేస్తే చర్యలు తీసుకోవడానికి చట్టాలు ఉన్నాయి కానీ బండి సంజయ్ వ్యక్తిగత దూషనాలకు దిగడానికి ఆయన ఎవరిని ప్రశ్నించారు,
కవిత లాగా బండి సంజయ్ కి అక్క చెల్లెలు అమ్మలు లేరా అని విమర్శించారు,
ఎమ్మెల్సీ కవిత ఎలాంటి తప్పులు చేయలేదని అందుకే సిఐడి విచారణకు ఢిల్లీకి పిలిపించిన అందుకు ఆమె దర్జాగా అంగీకరించారని సిఐడి అధికారుల విచారణకు ఆమె సహికరిస్తున్నారన్నారనే విషయాన్ని గుర్తు చేశారు,
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొంపల్లి సురేందర్ రావు, జడ్పిటిసి గుండం నరసయ్య, సర్పంచ్ గార్ల సుమతి, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మండలంలోని బిఆర్ ఎస్ పార్టీ మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్ లు కార్యకర్తలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *