సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలి: మర్కుక్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ కల్వకుంట్ల కవిత అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలి లేకుంటే రేపటినుండి తెలంగాణ సమాజం నుండి చిత్కారం తప్పదు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించినటువంటి కల్వకుంట్ల కవిత కుట్రపూరితంగా నమోదు చేయబడిన ఈడి కేసు విషయంలో అనవసర ప్రేలాపనులు మానుకోవాలి ఈరోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మీ బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి పలు రాజకీయ పార్టీలను మీరు ఈడి మరియు సిబిఐ సంస్థలచే ఏ విధంగా వేధిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు అదేవిధంగా ప్రాంతీయ పార్టీలలో అలజడులు సృష్టించాలని లక్ష్యంతో పని చేస్తున్నటువంటి మీ బిజెపి అధినాయకత్వం మరియు చెప్పినట్టుగా ఎటువంటి ఆధారాలు లేకున్నా కేసులు నమోదు చేస్తూ ఆ కేసులను కోర్టులలో నిరూపించడంలో విఫలమవుతున్న ఈడి మరియు సిబిఐ సంస్థలు రేపటి రోజున ప్రజాక్షేత్రంలో వాటి యొక్క ప్రబల్యం తగ్గక తప్పదు గత ఆరేడు సంవత్సరాలుగా మీ ప్రాబల్యంతో ఏ నాయకుల మీద అయితే కేసులు వేశారు అదే నాయకులు మీ బిజెపి పార్టీలో చేరిన తర్వాత ఆ కేసుల విచారణ నీరుగార్చిన సంగతి వాస్తవం కాదా మీ బిజెపి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే రాజు ద్రోహుల ఇప్పటికైనా మీ బిజెపి ప్రభుత్వ పెద్దలు మరియు మీ నాయకులు ఒక్క విషయం గ్రహించాలి అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు మీరు చేస్తున్న కుట్ర రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తుంది మీరు రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని లక్ష్యంతో పనిచేస్తున్న విషయం ప్రజలు గ్రహిస్తున్నారు ఎప్పటికైనా తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేస్తున్న కేసీఆర్ వైపు మరియు బిఆర్ఎస్ పార్టీ వైపు ఉంటారే తప్ప మీ చిల్లర ప్రయత్నాలు తెలంగాణ సమాజంలో చెల్లవు ఈరోజు మా కల్వకుంట్ల కవిత ఒక మహిళ శక్తిగా మహిళా బిల్లు కోసం ఉద్యమించాలని లక్ష్యంతో పని చేస్తుంటే మీరు ఆమెను మరియు బిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని లక్ష్యంతో చిల్లరమల్ల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ పార్టీ నాయకుడు బిఎల్ సంతోష్ లాగా విచారణ ఎదుర్కొనే సత్తా లేక కోర్టు మెట్లు ఎక్కలేదు ఒక వీరవనితలాగా ఢిల్లీకి వెళ్లి విచారణకు సహకరిస్తుంది ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది కావున ఈ కొన్ని రోజులు ఇబ్బందులు పెడుతుండొచ్చు కానీ అధికారం కోల్పోయే రోజులు మీకు అతి తొందరలో ఉన్నాయి ఆరోజు మీరు చేస్తున్న వంటి ఈ పాపాలకు ప్రాయశ్చిత్తం తప్పదు ఈ సమావేశంలో మర్కూక్ గ్రామ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ మరియు ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు సాయిని మహేష్, మొర్సు శ్రీనివాస్ రెడ్డి, మర్కూక్ గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షులు అజయ్ రెడ్డి మరియు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
