హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన అనిల్ కుమార్ ట్రాక్టర్ ప్రమాదంలో తీవ్ర గాయాల గురికాగా ఆర్విఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అత్యవసరంగా నెగిటివ్ బ్లడ్ అవసరం ఉందని ఫోన్ ద్వారా వచ్చిన సమాచారానికి స్పందించి వెంటనే ఆర్విఎం ఆస్పత్రికి వెళ్లి ఓ నెగిటివ్ రక్తదానం చేసిన రాయపోల్ ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షులు పుట్ట రాజు. ఇప్పటివరకు ఆరు సార్లు రక్తదానం చేయడం జరిగిందని అత్యవసర సమయంలో రక్తదానం చేయడం వల్ల వారి ప్రాణాలను కాపాడగలుగుతామని పుట్ట రాజు పేర్కొన్నారు. అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు పుట్టరాజుకి కృతజ్ఞతలు తెలియజేశారు.
