తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని విష్ణు భగవాన్ అద్భుత చిత్రాన్ని అవాలను ఉపయోగించి 3రోజులు శ్రమించి అద్భుతంగా రూపొందించి మంగళవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి భక్తిని చాటుకున్న శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రాష్ట్రస్థాయి కళారత్న, భక్తిరత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్బంగా మాట్లాడుతూ హిందువులు జరుపుకునే పండుగలలో తొలి ఏకాదశి పండుగ ఒకటన్నారు. తొలి ఏకాదశి రోజున భక్తి శ్రద్దలతో ఉపవాస దీక్ష చేస్తారన్నారు. విష్ణు భగవాన్ చిత్రాన్ని భక్తులు తిలకించి అద్భుతంగా ఉందని రామకోటి రామరాజును అభినందించారు. రామకోటి వ్రాయని వారు ఎవరన్నా ఉంటే తొలి ఏకాదశి నుండి ప్రారంభించాలని కోరారు.
