జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య ఐ.ఎ.ఎస్. గా ఖరారు.
మంచిర్యాల జిల్లా,జనవరి 21, 2026:
మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా విధులు నిర్వహిస్తున్న పి.చంద్రయ్య భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ & పెన్షన్స్ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ఐ.ఎ.ఎస్. గా ఖరారు చేయడం జరిగింది. జూలై 17, 2025 న మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహిస్తున్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





