మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామంలో కొత్తగా పెడుతున్న వెంకట్ రెడ్డి ఆయిల్ ఫామ్ తోటను మండల వ్యవసాయ అధికారి నాగేందర్ రెడ్డి గారు సందర్శించడం జరిగింది. ఈ ఆయిల్ పామ్ పంట ఆయిల్ పామ్ చట్టము 1993 ద్వారా ఆల్ రైతుల ప్రయోజనాల పరిరక్షణ కల్పించబడుతుంది. గెలలు కొనుగోలులో దళారి వ్యవస్థ లేదు, నేరుగా ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైతులు పండించిన ఆయిల్ ఫామ్ గెలలను కొనుగోలు చేస్తుంది. ఖచ్చితమైన మార్కెట్ వ్యవస్థ ఆయిల్ ఫామ్ రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో అమ్మిన జిల్లాలకు నగదు చెల్లింపులు జరుగుతాయి అని తెలియజేశారు. మన రాష్ట్రానికి సుమారు 3.66 లక్షల టన్నుల పాము ఆయిల్ అవసరం కాగా ప్రస్తుతం 39,346 టన్నులు మాత్రమే ఉత్పత్తి జరుగుతుందని ఈ కొరతను అధిగమించడానికి 2.5 లక్షల ఎకరాల ఆయిల్ ఫామ్ సాగుల్ చేయవలసి ఉన్నదని తెలియజేశారు. ప్రస్తుతం మన మండలంలో 76 మంది రైతులు 480 ఎకరాలలో ఈ ఆయిల్ ఫామ్ పంటను సాగు చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రజినీకాంత్ , విష్ణు వర్ధన్ మరియు రైతులు పాల్గొన్నారు.
