- సిద్దిపేట జిల్లా రాయపోల్ గ్రామంలోని రామస్వామి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం మరియు తలారి లక్షయ్య వారి కుటుంబ సభ్యులను దుబ్బాక నియోజకవర్గ బి ఆర్ ఎస్సీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి పరామర్శించి, ఆర్థిక సహాయం చేయడం జరిగింది. వారి వెంట రాయపోల్ జడ్పీటీసీ యదగిరి, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, రాయపోల్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ చారి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సింగరావు, తురుము ప్రశాంత్ తదితరులు ఉన్నారు.
